దేవినేని తెగువ కి సెల్యూట్ కొడుతున్న తెలుగు తమ్ముళ్ళు !

దేవినేని ఉమా మహేశ్వరరావు, టిడిపి పార్టీలో సీనియర్ నేత. ఇటీవల దేవినేని ఉమా మహేశ్వరరావు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి పై తీవ్ర ఆరోపణలు చేశారు. సాధారణంగా ఎప్పుడో కానీ మీడియా ముందుకు రాని దేవినేని ఉమా కరోనా నేపథ్యం లో తొలసారిగా ప్రభుత్వ పనితీరు పై నిప్పులు చెరిగారు. రేషన్ షాపులలో ఇచ్చే బియ్యం మరియు పప్పు అసలు బాగాలేవు అన్ని చెప్పుకోస్తు ఏపీ ప్రభుత్వం వలస కార్మికుల పై చూపిస్తున్న వైఖరిని కూడా తప్పు పట్టారు.

ఇలాంటి క్లిష్ట సమయంలో వారికి అండగా ఉండాల్సింది పోయి తిరిగి లాఠీ ఛార్జ్ చేస్తారా అన్ని వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.
నిజానికి ఇలాంటి సమయంలో ప్రతిపక్షం నుంచి వాయిస్ గట్టిగా వినిపించాలి అప్పుడే ప్రభుత్వం కూడా అలెర్ట్ గా ఉంటుంది, కానీ ఏపీ రాజకీయాలు
ఎవరికి అర్థం కావు. ఏది ఏమైనా దేవి నేని ఉమా మహేశ్వరరావు స్పందించిన తీరుకి మాట్లాడిన మాటలకి తెలుగు తమ్ములు హర్షం వ్యక్తం చేస్తున్నారు.