దేశం కళ్ళముందు మోడీ ని దులిపేయాలి …… కే‌సి‌ఆర్ స్కెచ్ ఇదే!!

ప్రస్తుతం భారత దేశ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ఇక దేశం ఎదుర్కొంటున్న ఆర్ధిక సంక్షోభాన్ని దాటేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించారు. ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ కూడా ప్యాకేజీ కి సంబంధించిన అన్ని వివరాలను వెల్లడించారు. కానీ దీన్ని పై రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ముఖ్య మంత్రులు అందరూ అసంతృప్తితో విచారం వ్యక్తం చేస్తున్నారు.

అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ కూడా కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ పై సంతృప్తిగా లేరు. నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో భాగంగా క్లిష్ట సమయంలో రాష్ట్రాలకు అండగా నిలవకుండా మొండి చేయి చూపిస్తారా అంటూ సీఎం కేసిఆర్ కేంద్రం పై ఆగ్రహం వ్యక్తం చేసాడు. పైగా కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల వాటాలను త్వరలోనే అందిస్తామని చెప్పారు. నిజానికి పన్నుల్లో వాటా ఎప్పుడు వచ్చేదే కానీ కేంద్రం ఇందులో కొత్తగా సాయం చేస్తున్నట్లు ఎందుకు బిల్డప్ ఇస్తుంది అన్ని తెలంగాణ సీఎం కేసిఆర్, కేంద్రం పై తీవ్ర అగ్రహంతో ఉన్నాడు.