భారీ డిజాస్టర్ నుండి తప్పించుకున్న విజయ్ దేవరకొండ..!

ప్రస్తుతం యూత్ అంతా విజయ్ దేవరకొండ జపం చేస్తున్నారని చెప్పొచ్చు. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలతో విజయ్ స్టార్ రేంజ్ కు వెళ్లాడు. ఈ ఇయర్ ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే ఆ సినిమా తర్వాత విజయ్ మీకు మాత్రమే చెప్తా సినిమా చేయాల్సి ఉంది. షమ్మీర్ సుల్తా అసలు ఈ సినిమా కథ విజయ్ కోసమే అనుకున్నాడట.

విజయ్ కూడా దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. కాని స్క్రిప్ట్ పూర్తయ్యాక సెట్స్ మీదకు వెళ్లేముందు మాత్రం ఎందుకో తను ఈ సినిమా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని తనకు తానే ప్రశ్నించుకుని తనకు లైఫ్ ఇచ్చిన పెళ్లిచూపులు డైరక్టర్ తరుణ్ భాస్కర్ తో ఈ సినిమా చేశాడు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ నిర్మాణంలో వచ్చిన మొదటి సినిమా మీకు మాత్రమే చెప్తా. ఈ సినిమా రిలీజ్ ముందు ఎంత హంగామా చేసినా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

అయితే ఈ సినిమా విజయ్ నిర్మాతగా చేతులు కాల్చుకున్నా సరే ఒకవేళ హీరోగా చేస్తే మాత్రం కెరియర్ లో భారీ డిజాస్టర్ గా నిలిచేది. ఇప్పుడు నిర్మాతగా మాత్రమే ఫెయిల్ అయిన విజయ్ అప్పుడు హీరోగా కూడా తన ఇమేజ్ కు పెద్ద డ్యామేజ్ అయ్యేది. ఇక విజయ్ నిర్మాణంలో మధుర శ్రీధర్ సహాయం చేయగా.. రిలీజ్ విషయంలో సునీల్ నారంగ్.. మైత్రి మూవీ సపోర్ట్ చేశారట.