రజనీకాంత్ , మురుగదాస్ ల ‘దర్బార్’ సినిమా రివ్యూ

సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా ప్యాన్ ఇండియా డైరక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న ఏ.ఆర్ మురుగదాస్ డైరక్షన్ లో వచ్చిన సినిమా దర్బార్. లైకా ప్రొడక్షన్ బ్యానర్ లో సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. అంచనాలకు తగినట్టుగానే సినిమా ఉంది. పోలీస్ ఆఫీసర్ గా రజిని స్టైల్ అదిరిపోయింది.. కాలా, పేట సినిమాల కన్నా రజిని స్టైల్ ను సూపర్ గా వాడుకున్నాడట మురుగదాస్. ఇక కథ రొటీన్ గా అనిపించినప్పటికి రేసీ స్క్రీన్ ప్లేతో సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా చేశాడు. పోలీస్ ఆఫీసర్ గా తన పని తాను చేసుకు వెళ్తున్న రజినికాంత్ కు ముంబై లో డ్రగ్ దందా నడిపిస్తున్న హరి చోప్రాతో ఢీ కొడతాడు. తనకు ఎదురొచ్చిన వారి అడ్డు తొలగించుకునే హరి చోప్రాకు సరైన బుద్ధి చెబుతాడు ఆదిత్య అరుణాచలం.

ఈ సినిమాలో రజిని ఎనర్జీ సూపర్ అని చెప్పొచ్చు. రజినికాంత్ ఒకప్పటి ఎనర్జీ స్టైల్ ను చూపించాడు మురుగదాస్. రజిని, నయనతారల మధ్య సీన్స్ చాలా బాగున్నాయి. నివేదా థామస్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. విలన్ గా సునీల్ శెట్టి తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఓవరాల్ గా ఈ సంక్రాంతికి రజిని ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా దర్బార్ సినిమా వచ్చింది. సినిమా కథ రొటీన్ గా అనిపించినా కథనం గ్రిప్పింగ్ గా సాగించాడు మురుగదాస్. ఈ సినిమాతో రజినిని ఫాం లోకి తీసుకురావడమే కాదు కొన్నాళ్లుగా ఆడియెన్స్ అంచనాలను రీచ్ అవని మురుగదాస్ కూడా తిరిగి తన పాత ఫాంలోకి వచ్చాడని చెప్పొచ్చు. కోలీవుడ్ లో రజినికి ఉన్న ఫాలోయింగ్ కు దర్బార్ సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంది. అయితే తెలుగులో కూడా ఈ సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఒకటి రెండు రోజుల గ్యాప్ తో వచ్చే మహేష్ సరిలేరు నీకెవ్వరు.. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాల రిజల్ట్ మీద రజిని సినిమా భవితవ్యం ఆధారపడుతుంది.