అన్నే కాదు తమ్ముడు తోపే.. దొరసాని టీజర్ తో దుమ్ముదులిపాడు..!

యువ హీరో విజయ్ దేవరకొండ యూత్ లో బీభత్సమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలతో స్టార్ రేంజ్ కు వెళ్లిన విజయ్ దేవరకొండ తన తమ్ముడిని హీరోగా పరిచయం చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా దొరసాని. కెవీఅర్ మహింద్ర డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజశేఖర్, జీవితల చిన్న కూతురు శివాత్మిక హీరోయిన్ గా నటిస్తుంది.

ఈమధ్య వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంప్రెస్ చేయగా లేటెస్ట్ గా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. రాజు.. దేవకిల ప్రేమకథగా దొరసాని వస్తుంది. కథ రొటీన్ గానే అనిపించినా టేకింగ్ బాగుందని అనిపిస్తుంది. ఇక హీరో ఆనంద్ యావరేజ్ గా ఉన్నా శివాత్మిక మాత్రం అదరగొట్టింది. దొరసానిగా శివాత్మిక పర్ఫెక్ట్ అనిపించుకుంది. హీరోయిన్ గా ఆమెకు మంచి లైఫ్ ఉంటుందని చెప్పొచ్చు.