ముఖ్యమంత్రి జగన్ మాస్టర్ ప్లాన్..! సంచలన నిర్ణయానికి రంగం సిద్ధం

ఏపి సిఎం వైఎస్ జగన్ తన మార్క్ పాలన చూపించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే నవరత్నాల హామీలను నెరవేర్చే క్రమంలో పనులు మొదలవ్వగా కొన్నాళ్లుగా కేవలం చర్చలకే పరిమితమైన కొన్ని విషయాలకు పూర్తిస్థాయిలో పరిష్కారం చూపించబోతున్నారు. ముఖ్యంగా ఏపిలో ఎస్సీ వర్గీకరణపై వైఎస్ జగన్ అద్భుతమైన పరిష్కార మార్గాన్ని చూపిస్తున్నారట. ఎస్సీలకు ఇచ్చే ప్రభుత్వ పథకాల్లో ఎక్కువగా మాలలకే ఎక్కువ వాటా అనుభవిస్తున్నారని మాదిగల నుండి విమర్శలు వచ్చాయి.

మాదిగ, రెల్లిలు పెద్దగా అవకాశాలు అందుకోవట్లేదని మంద కృష్ణ మాదిగ ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. అయితే ఎస్సీ వర్గీకరణలో మాల, మాదిగ, రెల్లిలు ఎవరిని నొప్పించకుండా ఉండేలా జగన్ ప్రత్యేకమైన నిర్ణయం తీసుకున్నారట. ఎస్సీలకు మూడు కార్పోరేషన్ లు ఏర్పాటు చేస్తున్నారట. మాల, మాదిగ, రెల్లి కులస్తులకు వేర్వేరు కార్పోరేషన్లు ఏర్పాటు చేయాలని జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారట.

ఉమ్మడి రాష్ట్ర సిఎంగా చంద్రబాబు నాయుడు ఎస్సీలను ఏబిసీడిలుగా వర్గీకరిస్తూ నిర్ణయం తీసుకోగా ఆ నిర్ణయాన్ని సుప్రీం కోర్ట్ తప్పుపట్టడంతో ఎస్సీల విభజన ఆగిపోయింది. అయితే ఇప్పుడు జగన్ తీసుకునే ఈ సంచలన నిర్ణయం అందరికి ఆమోదయోగ్యంగా ఉందని అంటున్నారు. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వ స్పందన రాకుంటే మాదిగలు మళ్లీ ఉద్యమానికి దిగాలనే ఆలోచన ఉన్నట్టు సంకేతాలు వచ్చాయి అందుకే జగన్ ఎస్సీ వర్గీకరణకు పరిష్కారంగా మూడు కార్పోరేషన్లు ఏర్పాటు చేస్తున్నారట.