జీవిత నాటకంలో నిష్క్రమించిన ‘గిరీష్ కర్నాడ్’

బహుబాషా నటుడు.. నాటక రచయిత గిరీష్ కర్నాడ్ ఈరోజు ఉదయం బెంగళూరులోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గిరీష్ కర్నాడ్ ఈరోజు కన్నుమూశారు. మహరాష్ట్రలోని మాథెరన్ లో 1938 మే 19 న గిరీష్ కర్నాడ్ జన్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హింది భాషల్లోఆయన నటించారు. నాటక రచనలో గిరీష్ కర్నాడ్ కు మంచి అనుభవం ఉంది.

నాటన రంగంలోనే ఆయనకు పద్మశ్రీ, పద్మ భూషణ్ అవార్డులు అందుకున్నారు. ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ అవార్డ్ కూడా అందుకున్నారు గిరీష్ కర్నాడ్. ఇక ఆయన నటించిన సినిమాలకు గాను నేషనల్ అవార్డ్, ఫిల్ ఫేర్ అవార్డులను ఎన్నో సంపాదించారు. తెలుగులో ధర్మచక్రం, శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్, పులి సినిమాల్లో నటించారు గిరీష్ కర్నాడ్. గిరీష్ కర్నాడ్ మృతి పట్ల దక్షిణాది సిని సెలబ్రిటీస్ అంతా తమ ప్రగాడ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.