‘ప్రశాంతత’తో ఫ్యూజులు లేపేసిన బాలయ్య

తన చుట్టూ ఉన్న వాతావరణం సౌకర్యంగా లేకపోతే బాలయ్య ఎలా రియాక్ట్ అవుతారో అందరికీ తెలుసు! ఆగ్రహావేశాలకు లోనై, తన వ్యక్తులపై మండిపడతారు. చుట్టుపక్కల ఉన్నవారిపై కూడా ఆయన నోరు పారేసుకోవడమో, చెయ్యి చేసుకోవడమో చేస్తుంటారు. కానీ.. తొలిసారి అందుకు భిన్నంగా ఆయన ప్రశాంతంగా ఉండడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.

హిందూపురం ఎమ్మెల్యేగా రెండోసారి గెలుపొందిన సందర్భంగా బాలయ్య ఈ ఆనందాన్ని తన నియోజకవర్గ ప్రజలతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన ముస్లిం సోదరులకు ఇటీవల ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అందరితో ఇంటరాక్ట్ అయిన ఆయన.. ఆ తర్వాత నమాజ్ కూడా చదివారు. అయితే.. ఇంతలోనే అనుకోకుండా వర్షం పడింది. దీంతో అక్కడ కాస్త గందరగోళం నెలకొంది.

ఇలాంటి పరిస్థితిలో బాలయ్య కోప్పడతారనుకుంటే.. అందుకు భిన్నంగా ఆయన ప్రశాంతంగా ఉండడమే కాకుండా పరిస్థితుల్ని చక్కబెట్టేందుకు ప్రయత్నించారు. ఎలాంటి హడావుడికి తావివ్వకుండా కూల్‌గా ఉన్నారు. బాలయ్యలోని ఈ మార్పు చూసి యావత్ తెలుగు ప్రజానీకం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. బాలయ్య ఇదే ప్రవర్తన కొనసాగిస్తే.. ఆయనకున్న స్థానానికి మరింత గౌరవం దక్కుతుందని అభిప్రాయాలు వస్తున్నాయి.