బిగ్ బాస్ నుండి అందుకే అతన్ని సాగనంపారు

బిగ్ బాస్ సీజన్ 4 మొదటివారం ఎలిమినేట్ అయ్యారు డైరక్టర్ సూర్య కిరణ్. షోలో వెళ్ళేప్పుడు వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టంట్ గా అనిపించిన ఆయన వారం రోజులకే ఆడియెన్స్ కు బోర్ కొట్టించేశారు. సూర్య కిరణ్ ఎలిమినేట్ అవడానికి గల కారణాలు ఏంటని ఒకసారి విశ్లేషించుకుంటే..

ఎంట్రీ ఇవ్వడమే బ్లాక్ అండ్ వైట్.. తనతో తనకే పోటీ అంటూ భారీ హంగామాతో వచ్చిన సూర్య కిరణ్.. సత్యం, రాజు భాయ్ సినిమాల దర్శకుడిగా కొంతమంది ఆడియెన్స్ కు మాత్రమే తెలుసు. హౌజ్ లో సెకండ్ కంటెస్టంట్ గా ఎంట్రీ ఇచ్చిన సూర్య కిరణ్ మొదటివారమే ఇంటి బాట పట్టారు. హౌజ్ లో ఉన్న మిగతా 15 మంది కంటెస్టంట్స్ ఏదో ఒక పనిచేస్తూ కనబడగా సూర్య కిరణ్ మాత్రం అందరికి సలహాలు ఇస్తూ కనిపించాడు. అక్కడ అతనికి మైనస్ మార్కులు పడ్డాయి.

అంతేకాదు అందరికి ఉచిత సలహాలు ఇవ్వడం కూడా హౌజ్ మేట్స్ లో కూడా అతని మీద వ్యతిరేకత వచ్చేలా చేసుకున్నాడు. ఆయన ముందు చెప్పకపోయినా అభిజిత్ మిగతా ఇంటి సభ్యులతో సూర్య కిరణ్ అసలు ఏం చేస్తున్నారు.. వాళ్ళకి వీళ్ళకి సలహాలు ఇవ్వడం తప్పా అంటూ ఆడియెన్స్ కు ఓ క్లూ కూడా ఇచ్చేశాడు. మోనాల్ తన పర్సనల్ విషయాలను షేర్ చేస్తున్న టైం లో అడ్డుపడటమే అతన్ని నామినేట్ అయ్యేలా చేసింది. అదే నామినేషన్ ద్వారా ఇప్పుడు హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యేలా చేసింది. ఏదో చేసేస్తాడు అనుకున్న సూర్య కిరణ్ హౌజ్ లో కూడా పనేమి చేయకుండా డైరక్షన్ చేశాడు కాబట్టే హౌజ్ నుండి ఆడియెన్స్ అతన్ని బయటకు పంపించారని అంటున్నారు. ఈ సీజన్ లో మొదటివారమే హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యి షాక్ ఇచ్చారు సూర్య కిరణ్.

సూర్య కిరణ్ అలా బయటకు వచ్చాడో లేదో స్టేజ్ మీద నాగార్జున ముందే అందరిని జంతువులతో పోల్చుతూ తన కసి తీర్చుకున్నాడు. మొదటి వారమే ఎలిమినేట్ అవడంతో మొఖం మీద అతనికి నెత్తుటి చుక్కలేదని చెప్పొచ్చు