డియర్ కామ్రేడ్ ట్రైలర్.. మరో సూపర్ హిట్ (వీడియో)

విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్మ డైరక్షన్ లో వస్తున్న క్రేజీ మూవీ డియర్ కామ్రేడ్. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను బిగ్ బెన్ పిక్చర్స్ సహ నిర్మాతలుగా ఉన్నారు. ఇప్పటికే పాటలతో హుశారెత్తించిన డియర్ కామ్రేడ్ ట్రైలర్ తో అదరగొట్టాడు. కాలేజ్ స్టూడెంట్ గా విజయ్ పర్ఫార్మెన్స్ అదుర్స్ అనిపిస్తుంది. తన ఫ్యాన్స్ ను అన్నివిధాలుగా శాటిస్ఫై చేసేలా డియర్ కామ్రేడ్ ట్రైలర్ ఉంది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే మరోసారి తనలోని నవరసాలను బయటకు తీసినట్ట్ ఉన్నాడు విజయ్ దేవరకొండ. లవ్, ఎఫెక్షన్, కామెడీ, ఎమోషన్ ఇలా అన్ని అంశాలు ఉన్న డియర్ కామ్రేడ్ విజయ్ ఖాతాలో మరో సూపర్ హిట్ తెచ్చి పెట్టేలా ఉంది.