మహమ్మద్ షమీ పై అరెస్ట్ వారెంట్.. బీసీసీఐ ప్రకటన

ప్రముఖ భారత క్రికెటర్ మహమ్మద్ షమీ కి కోల్ కతా లోని అలీపోర్ న్యాయస్థానం 15 రోజుల్లోగా కోర్టు ముందు హాజరు కావాలంటూ అరెస్ట్ వారెంట్ జారీ చేసి భారీ షాకే ఇచ్చింది. ప్రస్తుతం వెస్ట్ ఇండీస్ తో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆడుతున్న మహమ్మద్ షమీ కి బెయిల్ కోసం 15 రోజుల గడువు ఇచ్చింది ఆ కోర్టు. మహమ్మద్ షమీ పై తన భార్య హసీన్ జహాన్ 2018 లో గృహ హింస కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ కేసు లో భాగంగా షమీ పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. షమీతో పాటు తన సోదరుడు హసీద్ అహమ్మద్ కి కూడా కోర్టు వారెంట్ ఇచ్చింది.

అయితే ఈ వారెంట్ విషయంపై బీసీసీఐ విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రస్తుతం షమీ పై ఎటువంటి చర్య తీసుకోవడం లేదని త్వరలో తనపై వేసిన ఛార్జ్ షీట్ ని పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.