ట్వీట్లతో వాతలు పెట్టిన అసలైన ఇస్మార్ట్ శంకర్ : గిది సినిమారా భాయ్

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టి మంచి ఊపు మీదున్నాడు హీరో రామ్. 6 రోజులకే 56 కోట్ల రూపాయలకి పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఇస్మార్ట్ శంకర్ ఇప్పటికే అన్ని సెంటర్లలో లాభాల బాట పట్టాడు. అయితే ఇస్మార్ట్ శంకర్ లోని కొన్ని సన్నివేశాలపై వస్తున్న విమర్శలపై హీరో రామ్ తనదైన శైలిలో అదిరిపోయే ట్వీట్ వేసి విమర్శకుల నోర్లు మూయించాడు.”హీరో హెల్మెట్ పెట్టుకోలేదు హీరో స్మోక్ చేస్తున్నాడు హీరో అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు అని ఎంతసేపు ఇవే గాని హీరో అడ్డం వచ్చినవాళ్ళను చంపుతున్నాడు అని ఒక్కరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు జీవితానికి విలువ లేకుండా పోయింది సాడ్ ” అని ట్వీటాడు. అంతే కాకుండా మరో ట్వీట్ లో “గిది సినిమారా భాయ్.. సీన్ చూడండి.. సీన్ చేయకండి” అంటూ చురకలు అంటించాడు.