కరోనా కి, కులానికి లింక్ ఏంటి జగనా!!

కరోనా వైరస్ భయం తెలంగాణ ని చుట్టుముట్టింది. పారాసిటమాల్ వేసుకుంటే సరిపోద్ది అని మొన్నటిదాకా అన్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఇప్పుడు హఠాత్తుగా ఈ నెల చివరి వరకు విద్యాసంస్థలు, సినిమా థియేటర్లకు తాళాలేసాడు. తెలంగాణలో ఇంత జరుగుతున్నా కూడా, పక్క తెలుగు రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మటుకు సెలవులు లేవు, ప్యాంటు ఏస్కోని వచ్చేయ్ అన్నంత సులువుగా పారాసెటమాల్ వేసుకుని బైటికొచ్చేయండి అని అనేస్తున్నాడు. ఎక్కువ జనం గుమ్మిగూడే అవకాశాలున్న చోట్లన్ని ప్రభుత్వాలు ఆపేస్తుంటే, మునిసిపల్ ఎన్నికల కోసం మటుకు మన జగనన్న ఏర్పాట్లు చేసుకుంటూనే ఉన్నాడు.

పైగా ఎన్నికలు ఆపేస్తే కేంద్రానికి ఐదువేల కోట్లు నష్టం అంటూ, పట్టు చీర కట్టుకొని, పల్టీలు కొట్టినట్టు సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు. అక్కడితో ఆగకుండా ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకే కులానికి చెందడం వల్ల ఎన్నికల వాయిదా అని పాట పాడుతున్నాడు అని, జగనన్న ఏకంగా పంచ్ డైలాగ్ చెప్తున్నాడు. అంటే అన్నగారి లాజిక్ ప్రకారంగా, తెలంగాణ లో సెలవులిచ్చిన కెసిఆర్ దగ్గరినుండి అక్కడెక్కడో అమెరికా లో కరోనా కి తగిన చర్యలు తీసుకుంటున్న ట్రంప్ వరకు అందరూ ఈ కర్మ వర్గానికే, క్షమించండి, కమ్మ వర్గానికే చెందిన వారంటారా? ఏమో అన్నగారు చెప్తే నిజమే అయ్యుంటది.