కాజల్ కొత్త బిజినెస్.. ఏంటో తెలుసా..!

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కాజల్ ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క సైడ్ బిజినెస్ మొదలు పెట్టింది. ఇప్పటికే సినిమాల్లో వచ్చే సంపాదనే కాకుండా వాణిజ్య ప్రకటమలతో రెండు చేతులా సంపాదించేస్తున్న కాజల్ కొత్తగా మరో కమర్షియల్ బిజినెస్ మొదలు పెట్టిందని తెలుస్తుంది. ఇంతకీ కాజల్ ఏం బిజినెస్ చేస్తుంది అంటే జువెలరీ బిజినెస్ స్టార్ట్ చేసిందట. ముంబైలో కాజల్ ఓ జువెలరీ స్టోర్ ఓపెన్ చేసిందట.

స్టార్స్ అంతా తమకు వచ్చిన ఆదాయాన్ని ఇన్వెస్ట్ మెంట్ రూపంలో ఎక్కడో ఒకచోట పెడుతున్నారు. కొందరు రెస్టారెంట్ బిజినెస్ చేస్తుంటే కొందరు మరోలా తమ డబ్బుని బిజినెస్ రూపంలో కన్ వర్ట్ చేస్తున్నారు. కాజల్ జువెలరీ బిజినెస్ బాగా క్లిక్ అయ్యిందని తెలుస్తుంది. తన స్టోర్ కు తానే బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటుందట. అంతేకాదు తనకు తెలిసిన వారందరికి తన స్టోర్ లోనే జువెలరీ షాపింగ్ చేయమని చెబుతుందట. ఎంతైనా మార్కెటింగ్ స్ట్రాటజీ తెలిసింది కాబట్టే బిజినెస్ లోకి దిగిందని అనుకుంటున్నారు. మొత్తానికి అమ్మడు బిజినెస్ సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.