తనను చంపేస్తారని బెదిరిస్తున్నారు.. కత్తి కార్తీక ఆవేదన!

యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ కత్తి కార్తీకతో పాటు ఆరుగురిపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.  అయితే తాను ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్న అక్కసుతో కొంత మంది కావాలనే తనపై బురుద జల్లుతున్నారని అన్నారు. 52 ఎకరాల స్థలాన్ని రూ. 35 కోట్లకే ఇప్పిస్తామని చెప్పి… కోటి రూపాయలు అడ్వాన్స్ గా తీసుకుని మోసం చేశారంటూ వారిపై కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది.

బంజారాహిల్స్‌కు చెందిన టచ్‌స్టోన్ ప్రాపర్టీ డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఎండీ దొరస్వామి, టీంవన్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఎండీ శ్రీధర్ గోపిశెట్టి ఇద్దరూ మంచి స్నేహితులు. తన సంస్థను మరింత విస్తరించాలనుకుంటున్నానని, ఎక్కడైనా భూమి ఉంటే చూసిపెట్టాలని స్నేహితుడు శ్రీధర్‌ను దొరస్వామి కోరారు. ఈ అంశంపై కత్తి కార్తీక స్పందించారు.

తాను ఎవరినీ మోసం చేయలేదని చెప్పారు. రాజకీయ కక్షతోనే తనపై కేసులు పెడుతున్నారని అన్నారు.  కేసు పెట్టిన వ్యక్తికి రెండు నెలల క్రితమే లీగల్ నోటీసులు ఇచ్చామని… అలాంటప్పుడు హఠాత్తుగా తమపై చీటింగ్ కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. ఈ మధ్యనే తనను చంపుతామని బెదిరించారని… దీనికి సంబంధించి రామాయంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని చెప్పారు.