అందాల అప్సరస అక్కడ అడుగెడితే.. తమిళ తంబీలకు ఇక

బాలీవుడ్ లస్ట్ స్టోరీస్ తో కుర్రాళ్ల హృదయాల్లో గిలిగింతలు పెట్టిన కియరా అద్వాని తెలుగులో సూపర్ స్టార్ మహేష్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ సరసన నటించింది. రెండు సినిమాల్లో ఒకటి హిట్టు ఒకటి ఫట్టు అయినా సరే అమ్మడికి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే తెలుగులో సూపర్ హిట్టైన అర్జున్ రెడ్డి హింది రీమేక్ లో నటిస్తున్న కియరా అద్వాని ఇప్పుడు కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుందని తెలుస్తుంది.

తెలుగులో క్లిక్ అయిన ఏ హీరోయిన్ అయినా వాళ్ల నెక్స్ట్ టార్గెట్ కోలీవుడ్ అవుతుంది. ఈ క్రమంలో కియరా అద్వాని రెండు సినిమాలతో తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకోగా తమిళంలో మొదటి అవకాశాన్ని అందుకుంది. శివ కార్తికేయ హీరోగా విఘ్నేష్ శివ డైరక్షన్ లో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా కియరా అద్వాని సెలెక్ట్ అయ్యిందట. కచ్చితంగా కియరా తమిళ తంబీలను అలరించడం ఖాయమని చెప్పొచ్చు.