విజయ్ దేవరకొండతో మహేష్.. అదిరిపోయే ప్లాన్..!

సూపర్ స్టార్ మహేష్ పూర్తిస్థాయి సినిమా నిర్మాణానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. జి.ఎం.బి ప్రొడక్షన్స్ లో మహేష్ ఆల్రెడీ తన సినిమాలకు షేర్ అడుగుతుండగా ఇప్పుడు ఈ ప్రొడక్షన్ లో మీడియం బడ్జెట్ సినిమాలు నిర్మించాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో యువ హీరో విజయ్ దేవరకొండతో మహేష్ టీం సంప్రదింపులు చేస్తున్నారట. యువ హీరో అయినా ఈమధ్య యూత్ లో బీభత్సమైన ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ.

అందుకే మహేష్ కూడా విజయ్ తో అయితే సినిమా సేఫ్ జోన్ లో ఉంటుందని అనుకుంటున్నాడట. అయితే విజయ్ ఇప్పటికే మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు. ఆల్రెడీ డియర్ కామ్రేడ్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుండగా క్రాంతి మాధవ్ డైరక్షన్ లో సినిమా కూడా షూటింగ్ జరుపుకుంటుంది. ఇదే కాకుండా ఆనంద్ అన్నామలై డైరక్షన్ లో హీరో మూవీ కూడా లైన్ లో ఉంది. రెండేళ్లకు సరిపడా డేట్స్ అడ్జెస్ట్ చేయగా ఇప్పుడు మళ్లీ మహేష్ కోసం విజయ్ సినిమా చేస్తాడని తెలుస్తుంది. మరి మహేష్ నిర్మాతగా విజయ్ దేవరకొండ చేసే ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.