మరో మంచి పని కోసం కదిలొచ్చిన మంచు హీరో

మంచి పని అంటే తాగే మంచినీళ్లను కూడా పక్కన పెట్టేసి మరీ ముంచుకొచ్చేంత మంచోడు మన మంచు మనోజ్. దిశా కుటుంబాన్ని పరామర్శించడం గాని, ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు తన వాయిస్ వినిపించడం గాని చేయడంలో కుర్రోడు ముందుంటాడు. ఇప్పుడు మరో సారి అలాంటి పని కోసమే ముందుకొచ్చాడు.

కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తుండడంతో, శానిటైజర్లు, మాస్కులు వాడమని అందరూ ప్రచారాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ మనోజ్ మటుకు కేవలం ప్రచారం దగ్గరే ఆగిపోకుండా శానిటైజర్లు, మాస్కుల గురించి అవగాహన లేని వారికి, లేదా కొనే స్థోమత లేని ఏరియా వారికి తానే ఉచితంగా పంచుతున్నానంటూ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక పోస్ట్ పెట్టాడు.

దానితో నెటిజన్లు ప్రస్తుతం మనోజ్ ని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. నువ్వు మంచు మనోజ్ వి కాదు, మంచి మనోజ్ అని,మనసున్న మనోజ్ అని ఇలా పూర్తిగా పాజిటివ్ మెసేజ్ లతో మనోజ్ సోషల్ మీడియా అకౌంట్లు నిండిపోయాయి. ఏదేమైనా ఆపత్ కాలంలో దాని గురించి అవగాహన, స్థోమత లేని వారికి ఈ రకమైన సేవలతో మనోజ్ ముందుకొచ్చి తన పెద్ద మనసును చాటుకున్నాడు.