నాగబాబు, రోజా జబర్దస్త్ రీ ఎంట్రీ.. వీళ్లు జబర్దస్త్ వదలరా..!

బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ అంటే ఆడియెన్స్ లో బీభత్సమైన క్రేజ్. షో వల్ల ఎంతోమంది కమెడియన్స్ తమ టాలెంట్ చూపిస్తున్నారు. ఇదిలాఉంటే ఏపిలో ఎలక్షన్స్ వల్ల ఈ షోకి జడ్జులుగా చేస్తున్న నాగబాబు, రోజా ఇద్దరు షోకి దూరమయ్యారు. నాగబాబు ఎంపిగా ఓడిపోగా.. ఎమ్మెల్యేగా రోజా గెలిచింది. అయితే జబర్దస్త్ షోకి కొన్నాళ్లు గ్యాప్ ఇవ్వగా వీళ్లిక షోకి రావడం కష్టమేనని అనుకున్నారు. నాగబాబు, రోజాల స్థానంలో శేఖర్ మాస్టర్, మీనా, సంఘవి, జానీ మాస్టర్ ఇలా కొందరిని తెచ్చిపెట్టారు.

అయితే రెండు వారాలుగా ఆలి, రోజా జబర్దస్త్ జడ్జులుగా ఉంటున్నారు. రోజా ఎంట్రీతో షోకి మళ్లీ పాత కళ రాగా వచ్చే వారం ఎపిసోడ్ ప్రోమోలో నాగబాబు కూడా రావడం మళ్లీ షోకి ఊపొచ్చింది. వారిద్దరు వస్తున్నారని ముందే తెలిసిన హైపర్ ఆది జబర్దస్త్ కు వారు సూర్య చంద్రులు వాళ్లు లేకపోతే షో లేదు అన్నట్టుగా మాట్లాడాడు. మరి నాగబాబు, రోజా షో కొనసాగిస్తారా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. నాగబాబు ఎలాగు ఓడారు కాబట్టి షో కొనసాగిస్తారు.. అయితే ఈసారి గెలిస్తే తాను జబర్దస్త్ చేయడం కష్టమని చెప్పింది రోజా.. మరి ఆమె తన నిర్ణయం మార్చుకుంటారో లేదో చూడాలి.