నందమూరి “మనం” కి బాలయ్య గ్రీన్ సిగ్నల్.. అభిమానులకి వెర్రెత్తించే వార్త !!

అక్కినేని కుటుంబం మొత్తం కలిసి చేసిన “మనం” ఆ కుటుంబానికి ఎంత మంచి పేరు తీసుకువచ్చిందో అందరికీ తెలుసు. అక్కినేని నాగేశ్వరావు కి కూడా ఆ సినిమా మంచి వీడుకోలు పలికినట్లయింది.నందమూరి కుటుంబం నుండి కూడా అలాంటి బొమ్మ కోసం నందమూరి అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య బాబాయ్ అబ్బాయిలకి మధ్య పొసగడం లేదని విపరీతంగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ హరికృష్ణ మరణం తర్వాత అటు బాలయ్య బాబు ఫంక్షన్స్ కి అబ్బాయిలు, మరోవైపు అబ్బాయిల ఫంక్షన్స్ కి బాలయ్య బాబు ముఖ్య అతిధిగా పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

ఈ సందర్భంలో నిర్మాతలు “మనం” లాంటి కుటుంబ సభ్యులు మొత్తం నటించే విధంగా ఒక సినిమా ప్లాన్ చేద్దామని బాలయ్య వద్ద ప్రస్తావించగా “ఓకే” అనేశారంట. కానీ అటు బాలయ్య బాబు ఇమేజ్ ఇటు ఎన్టీఆర్ ఇమేజ్ లకి ఏమాత్రం తగ్గకుండా కథ, కథనాలు ఉండే విధంగా ఉండాలని సూచించారట. అభిమానులు ఎదురుచూసిన సమయం ఇంకెంతో దూరంలో లేదని.. అందరి అంచనాలకి మించి ఉండేలా చూసుకొంటామని నిర్మాతలు బాలయ్యకి మాటిచ్చారంట. ఇదే కానీ వాస్తవ రూపం దాల్చిందంటే బాక్స్ ఆఫీస్ రికార్డులు అన్ని దుమ్ము లేపటం ఖాయమే!