కరోనా పెట్టిన కుంపటి: నితిన్ ఆగినా, నిఖిల్ ఆగేలా లేడు.

కరోనా వైరస్ ప్రస్తుతం దేశాన్ని కాలకేయుడి భాషలా అర్ధం కాకుండా వేధిస్తుంది, కట్టప్పలా ఎప్పుడు వెన్నుపోటు పొడుస్తుందో అని ప్రతి ఒక్కర్ని వణికిస్తోంది. కానీ అలాంటి వనకడాలు మా దగ్గర పనికిరావంటూ కుర్ర హీరో నిఖిల్ స్ట్రాంగ్ గా చెప్తున్నాడు. ప్రభుత్వమే పనులు, చదువులు పక్కనపెట్టి ఇంట్లో కూర్చొండ్రా నాయనా అని సెలవిలుస్తుంటే, ఈ కుర్రోడు మటుకు ఏప్రిల్ పదహారో తారీఖున పెళ్లి పెట్టుకొని, దానికే ఫిక్స్ అయ్యాడు. ఇప్పటికే ఒకసారి పెళ్లి ఫిక్స్ చేసుకొని క్యాన్సల్ అయినందుకు, రెండోసారి అది సెంటిమెంట్ అవకూడదని, ఏం జరిగినా సరే అదే డేట్ కి మనోడు ఒక ఇంటోడు అవ్వాలని ముచ్చట పడుతున్నాడు.

మరో పక్క ఇప్పటికే నిశితార్థం కూడా చేసుకొని ఏప్రిల్ 15న పెళ్లి పెట్టుకున్న నితిన్ మటుకు, ఈ కరోనా వైరస్ వల్ల ఇప్పుడు ముందుకెళ్ళాలా వద్దా అనే సందేహంలో పడ్డాడు. దీని గురించి మీడియా ప్రతినిధులు నితిన్ అక్కని సంప్రదిస్తే, సరైన నిర్ణయం తీసుకొని తొందరలోనే మీడియా కి వెల్లడిస్తామని ఆవిడ తెలిపారు.