15ఏళ్లుగా అత్యాచారం.. నింధితున్ని దారుణంగా పొడిచి చంపిన బాధితురాలు!

ప్రస్తుతం మనిషి ఎంత టెక్నాలజీ పరంగా ముందుకు సాగుతున్నా.. తనలోని పైశాచిక కోరికలు మాత్రం చంపుకోలేకపోతున్నారు. కొంత మంది కామాంధులు ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఆడవారిపై రెచ్చిపోతూ అత్యాచారాలకు పాల్పపడుతున్నారు. చిన్న పిల్లలు అని కూాడా చూడకుండా అత్యాచారాలు చేస్తున్నారు. తాజాగా ఓ మహిళను అశ్లీల వీడియోలు చూపించి తనని గత 15ఏళ్లుగా అత్యాచారం చేస్తున్న నిందితుణ్ని కత్తితో 25సార్లు పొడిచి చంపింది.

రాజధాని భోపాల్‌కు 214 కిలోమీటర్ల దూరంలో ఉన్న మధ్యప్రదేశ్ గుణాలో గత 15 సంవత్సరాలుగా తనపై అత్యాచారం చేస్తున్న నిందితుణ్ని  31 ఏళ్ల మహిళ 25 సార్లు కత్తితో పొడిచి చంపింది. అ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. అశోక్ నగర్ లో నివాసం ఉండే నిందితుడు బ్రిజ్ భూషణ్ శర్మ 2005లో 15 సంవత్సరాల వయస్సున్న ఓ బాధితురాలి అత్యాచారం చేశాడు. ఆనాటి నుంచి ఆ మహిళను పదే పదే బెదిరిస్తూ  15ఏళ్లుగా ఆమెపై దారుణానికి పాల్పడుతూ వచ్చాడు.

బాధితురాలు పెళ్లైనా సరే ఆమెను బెదిరించి..విధుల నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లే భర్త లేని సమయంలో దారుణానికి ఒడిగట్టాడు. ఇది భరించలేక ఆమె వంటింట్లో ఉండే కత్తి తీసుకు వచ్చి తన కసితీరా 25 సార్లు పొడిచి చంపింది. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతు 15ఏళ్ల నుంచి నిందితుడు తనపై అత్యాచారం చేస్తున్నాడని అందుకే హత్యచేసినట్లు పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.