పవన్, మహేష్ కలిసి చేయాల్సిన సినిమా అట

‘వి’ ది మూవీ.. నాని మొదటిసారి విలన్ గా, పైగా సుధీర్ బాబు హీరోగా చేస్తున్న సినిమా కాబట్టి, దీనిపై ఒక ప్రత్యేకమైన అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలు టీజర్ రిలీజ్ అయ్యాక డబుల్ అయ్యాయనే చెప్పాలి. ఈ వారం విడుదలవాల్సిన సినిమా అయినా కూడా కరోనా వైరస్ గురించి తెలంగాణ ప్రభుత్వం థియేటర్లను మూసివేయడంతో, ఏప్రిల్ కి షిఫ్ట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది.

ఈటీవీ లో కమెడియన్ అలీ, తానే హోస్ట్ చేస్తున్న షో ‘అలీ తో సరదాగా’. ఈ షో కి గెస్ట్ గా సుధీర్ బాబు ఈ వారం రాబోతున్నారు. దానికి సంబంధించిన ప్రోమో ఒకటి యూట్యూబ్ లో విడుదలైంది. ఆ ప్రోమోలో సుధీర్ బాబు ‘వి’ ది మూవీ సినిమాలో మొదట్లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి హీరోలు ఉంటే బాగుంటుంది అని దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి తనతో చెప్పారని తెలిపాడు.

నిజానికి టీజర్ లో అటు సుధీర్ క్యారెక్టర్, ఇటు నాని క్యారెక్టర్ రెండూ మంచి యాక్షన్ బేస్డ్ గా అనిపించాయి. అంత స్టఫ్ ఉన్న క్యారెక్టర్లలో మాస్ ఇమేజ్ ఉన్న పవన్, మహేష్ చేస్తే కలెక్షన్లు కౌంట్ చేసుకునే లోపే కాటికెళ్ళిపోతామేమో. ఇక ఈ వార్త అభిమానులకు లీక్ అయ్యాక, సోషల్ మీడియా లో పవన్ నాని చేసిన విలన్ క్యారెక్టర్ లో, మహేష్ సుధీర్ చేసిన పోలీస్ క్యారెక్టర్ లో అయితే బాగుంటారని ఒకటే డిస్కషన్లు. ఆ హీరోలు ఈ కథ చెప్పుంటే ఒప్పుకుంటారా లేదో అటుంచితే, పవన్ ని, మహేష్ ని ఒకే తెర పైన చూడాలనే ఆ ఊహ మటుకు అదిరిపోయింది, కదా?