జగన్ వల్లే పవన్ వరుస సినిమాలు చేస్తున్నాడు !!

అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కే కాకుండా యావత్ సినిమా అభిమానులకి షాక్ ఇస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో హిందీ పింక్ రీమేక్ సినిమా, క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా అలాగే తనకి “గబ్బర్ సింగ్” లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో ఇంకో సినిమా ప్రస్తుతం ఖరారు కాగా ఇంకా బాబీ దర్శకత్వంలో మరియు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో కూడా పవన్ కళ్యాణ్ తర్వాతి సినిమాలు చేయబోతున్నట్లు ఫిలిం నగర్ లో టాక్ నడుస్తుంది.

ఎన్నికల ఫలితాలు వచ్చాక రాజకీయాల్లోనే తాను ఫుల్ టైమ్ ఉంటాడనుకుంటే మళ్ళీ వరుస సినిమాలు చేయడానికి గల కారణం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కారణమంటున్నారు. అదెలాగా అనుకుంటున్నారా ? ఎన్నికల ముందు పవన్ సభలలో ప్రసంగిస్తూ జగన్ పరిపాలన మంచిగా ఉంటే మాత్రమే తాను సినిమాలు చేస్తానని చెప్పుకొచ్చిన మాట తెలిసిన విషయమే!! జగన్ పాలన బాగుంది కాబట్టే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తున్నాడని అంటున్నారు.