ఒక్క నైట్ కోటి.. అప్పుడు ఒప్పుకోలేదు.. ఇప్పుడు 20 లక్షలకే..!

ఒరు అధార్ లవ్ అనే మళయాళ సినిమా టీజర్ తో కన్నుగీటి కుర్ర కారు మనసులు గెలిచిన భామ ప్రియా ప్రకాశ్ వారియర్. ఆ టీజర్ వల్ల వచ్చిన క్రేజ్ ద్వారా మళయాళ సినిమాను తెలుగులో డబ్ చేసి లవర్స్ డే టైటిల్ తో రిలీజ్ చేశారు. అయితే ఒరు ఆధార్ లవ్ సినిమా టైంలో అమ్మడికి వచ్చిన క్రేజ్ తో వరుస ఛాన్సులు వచ్చాయి. ఆమె ఒప్పుకుంటే చాలు కోటి రూపాయలు ఇచ్చి సినిమా చేసేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు. కాని సీన్ మారింది.. సినిమా రిలీజ్ తర్వాత అది ఫ్లాప్ అవడంతో అమ్మడిని మందలించే వారే లేరు.

అప్పుడు కోటి ఇస్తానని వచ్చిన దర్శకులు ఇప్పుడు 20 లక్షలు ఇస్తామని అంటున్నారట. ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిన ప్రియా ప్రకాశ్ ఒరు ఆధార్ లవ్ సినిమా టైంలో వచ్చిన ఛాన్సులు వద్దనేసింది. అయితే అప్పుడు కోటి ఇస్తామన్న దర్శక నిర్మాతలు ఇప్పుడు పాతిక లక్షలు ఇస్తామంటున్నారట. నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి డైరక్షన్ లో వస్తున్న సినిమాలో ప్రియా హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. ఈ సినిమాకు గాను అమ్మడికి 20 లక్షల రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు టాక్. ఒరు ఆధార్ లవ్ సినిమా టైంలో సినిమాలు ఒప్పుకుంటే కనుక సినిమాకు కోటి ఇచ్చేవారు. పాపం ప్రియా ఈ విషయం తెలిసిన వారు తను చాలా అన్ లక్కీ అని అంటున్నారు.