దేవి శ్రీతో పెళ్లి.. పూజితా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

షార్ట్ ఫిల్మ్స్ తో తన టాలెంట్ చూపి హీరోయిన్ గా ప్రమోట్ అయిన అమ్మడు పూజితా పొన్నాడ ఈమధ్య తరచు సినిమాల్లో కనిపిస్తుంది. వేర్ ఈజ్ వెంకటలక్ష్మి సినిమాలో నటించిన ఈ అమ్మడు రీసెంట్ గా 7 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రంగస్థలం సినిమాలో ఆది లవర్ గా నటించిన పూజిత ఆ సినిమా టైంలో మ్యూజిక్ డైరక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తో లవ్ లో పడ్డదని వార్తలు వచ్చాయి. అంతేకాదు డిఎస్పి కూడా పూజితను పెళ్లాడుతాడని వైరల్ న్యూస్ అయ్యింది.

7 సినిమా ప్రమోషన్స్ పూజితా మరోసారి డిఎస్పి రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది. కేవలం సినిమా ఫంక్షన్ లో మాత్రమే దేవి శ్రీ సర్ ను కలిశా అంతే కాని రీ రూమర్స్ ఎలా వచ్చాయో నాకు తెలియదన్నది. ఈ వార్తలు విన్నప్పుడు చాలా బాధపడ్డానని.. ఆ తర్వాత కుదుటపడ్డానని చెప్పుకొచ్చింది పూజిత. అందం అభినయం రెండు ఉన్నా ఈ అమ్మడికి లక్ కలిసి రావట్లేదని చెప్పాలి. ఒక్క హిట్టు పడితే అమ్మడి దశ తిరుగుతుంది మరి అది ఏ సినిమాతో జరుగుతుందో చూడాలి.