‘కొదమ సింహం’ చరణ్.. అదరగొట్టిన మెగా పవర్ స్టార్..!

జూన్ 12న తమ పెళ్లిరోజును పురస్కరించుకుని ముందే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. జూన్ 12 రాం చరణ్ ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ లో ఉంటాడు. అందుకే ఓ రెండు వారాలు ముందే ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు చరణ్ అండ్ ఉపాసన. ఆఫ్రికా అడవుల్లో వారు చేస్తున్న ఎంజాయ్ మెంట్ ను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుటుంది ఉపాసన. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఉపాసన లేటెస్ట్ గా అక్కడ పిక్స్ షేర్ చేసింది.

అందులో రౌండ్ హ్యాట్ తో సోఫాలో కూర్చుకున్న చరణ్ స్టిల్ ఒకటి ఉంది. పక్కనే ఉపాసన కూడా కూర్చుకుంది. అయితే ఆర్.ఆర్.ఆర్ కోసం పెంచిన మీసం కూడా తోడవడమో కొదమ సింహం లానే ఉన్నాడు రాం చరణ్. ప్రస్తుతం సోషల్ మీడియాలో రాం చరణ్ కొదమ సింహం లుక్ వైరల్ గా మారింది. చిరుత టైంలో చిరు వాసుడు ఇతనా అనుకున్న మెగా ఫ్యాన్స్ తోనే మెగా పవర్ స్టార్ అనిపించుకున్న చరణ్ రంగస్థలంతో నటుడిగా పరిపూర్ణత తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రాజమౌళ్ళి ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.