విజయ్ దేవరకొండతో.. విసిగిపోయాను.. రష్మిక షాకింగ్ కామెంట్స్..!

తెలుగులో సూపర్ క్రేజ్ ఏర్పరచుకున్న జంట విజయ్ దేవరకొండ, రష్మిక గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ రెండు సినిమాల్లో నటించి మెప్పించారు. గీతా గోవిందంతోనే ఈ ఇద్దరిది క్రేజీ పెయిర్ గా ఏర్పడింది. ఆ సినిమాలో వీరి జంట బాగా కుదిరింది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ లో కూడా వీరి సాన్నిహిత్యం బాగుంది. అయితే విజయ్ తో సినిమా చేయడం వల్ల ప్రొఫెషనల్ గా ఏమో కాని పర్సనల్ గా చాలా ఇబ్బందులు ఎదుర్కుంటుంది రష్మిక.

డియర్ కామ్రేడ్ తో కన్నడలో రష్మిక మీద విమర్శలు వచ్చాయి. రష్మిక రోహిత్ శెట్టిల మ్యారేజ్ చెడిపోడానికి కారణం విజయ్ దేవరకొండ అని వార్తలు రాశారు. అయితే ఈ వార్తలు విని విసిగిపోయిన రష్మిక ఇక మీదట విజయ్ దేవరకొండతో నటించకూడదని డిసైడ్ అయ్యిందట. విజయ్ తో లవ్ ఎఫైర్.. డేటింగ్.. ఇలాంటి వార్తలన్ని తనకు విసుగు పుట్టించాయని.. అందుకే ఇక మీదట మరో రెండు మూడు ఏళ్ల దాకా విజయ్ తో నటించేది లేదని ఖరాకండిగా చెప్పేసింది రష్మిక.

ప్రస్తుతం రష్మిక తెలుగులో సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో పాటుగా సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది. ఇదే కాకుండా కోలీవుడ్ లో కార్తి హీరోగా వస్తున్న సినిమాలో కూడా రష్మిక నటిస్తుంది. మొత్తానికి రష్మిక మాత్రం టాలీవుడ్, కోలీవుడ్ లో వరుస ఛాన్సులతో మంచి ఫాం లో ఉందని చెప్పొచ్చు.