ఆర్.ఆర్.ఆర్ నుండి అదిరిపోయే న్యూస్.. .. తారక్ ఫ్యాన్స్ కు పూనకాలే!!

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా గురించి ఎలాంటి వార్త అయినా అదో సెన్సేషన్ గా మారుతుంది. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ కలిసి నటిస్తున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. రియల్ హీరోస్ అల్లూరి సీతారామరాజు, కొమరం భీం పాత్రల్లో చరణ్, ఎన్.టి.ఆర్ నటిస్తున్నాడు.

ఇక ఈ సినిమా కోసం ఒక్క ఫైట్ సీన్ కే 45 కోట్లు ఖర్చు పెడుతున్నారట. తారక్ తో ఈ ఫైట్ సీన్ ఉంటుందట. ఈ సీన్ లో 2 వేల మంది జూనియర్ ఆర్టిస్ట్ పని చేస్తున్నారట. బాహుబలిలో యుద్ధం సీన్ ను తలపించేలా ఈ సీన్ ఉంటుందని అంటున్నరు. ఫైట్ సీన్ కు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే సినిమాలో అది హైలెట్ గా నిలిచే అవకాశం ఉంది. సినిమాలో అలియా భట్ ఒక హీరోయిన్ కాగా సెకండ్ హీరోయిన్ గా సాయి పల్లవిని సెలెక్ట్ చేశారని తెలుస్తుంది.