ఆ రోజున జూనియర్ ఎన్.టి.ఆర్ ఫస్ట్ లుక్.. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. తన సినిమాలో ఒక హీరో ఉంటేనే రికార్డుల అంతు చూసే జక్కన్న ఈసారి ఇద్దరు సూపర్ స్టార్స్ తో ట్రిపుల్ ఆర్ చేస్తున్నాడు. మెగా నందమూరి కాంబినేషన్ సినిమా ఊహించడానికే ఫ్యాన్స్ రోమాలు నిక్కబొడుకునేలా ఆర్.ఆర్.ఆర్ కాంబో ఫిక్స్ చేశాడు రాజమౌళి. ఇది కచ్చితంగా రాజమౌళి వల్లే సాధ్యమైదని తెలిసిందే.

రియల్ హీరోస్ అల్లూరి సీతారామరాజు, కొమరం భీం పాత్రల్లో రాం చరణ్, ఎన్.టి.ఆర్ నటిస్తున్నారు. సినిమాలో అలూరిగా రాం చరణ్ తన మీసపు కట్టుతో సైరా ప్రమోషన్స్ లో కనిపిస్తున్నాడు. కాని ఎటొచ్చి కొమరం భీం లుక్ లో తారక్ ఎలా ఉండబోతున్నాడు అన్నది చిన్న క్లూ కూడా దొరకడ లేదు. ఆర్.ఆర్.ఆర్ ప్రెస్ మీట్ లో ఇద్దరు హ్యాట్స్ తో కనిపించినా పెద్దగా తేడా తెలియలేదు. ఇదిలాఉంటే నందమూరి ఫ్యాన్స్ కోసం ఆర్.ఆర్.ఆర్ లో తారక్ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.

అక్టోబర్ 22న ఆర్.ఆర్.ఆర్ సినిమా ఎన్.టి.ఆర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారట. ఆరోజు కొమరం భీం జయంతి అందుకే ఆరోజునే సిల్వర్ స్క్రీన్ కొమరం భీం ను రివీల్ చేస్తారట. ప్రమోషన్స్ లో రాజమౌళిని మించి వాడు ఎవరు లేరు. కొమరం భీం గా తారక్ నందమూరి ఫ్యాన్స్ కు మాత్రమే కాదు సిని ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తాడని అంటున్నారు. 2020 జూలై 30న రిలీజ్ ఫిక్స్ చేసిన ఆర్.ఆర్.ఆర్ కచ్చితంగా మరోసారి తెలుగు సినిమా స్టామినాను ప్రూవ్ చేస్తుందని అంటున్నారు.