సాహోరే సాహో.. ఎంత కలెక్ట్ చేస్తే సేఫో తెలిస్తే షాక్ అవుతారు..!

బాహుబలితో నేషనల్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న ప్రభాస్ తన ఫ్యాన్స్ ను శాటిస్ఫై చేసేలా ఈసారి సాహో అంటూ రాబోతున్నాడు. రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడిగా తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న సుజిత్ తన సెకండ్ మూవీనే సాహో లాంటి భారీ సినిమా చేస్తాడని ఎవరు ఊహించి ఉండరు. సుజిత్ చెప్పిన స్క్రీన్ ప్లే నచ్చడం వల్ల ఈ సినిమా చేశానని చెప్పుకొచ్చాడు ప్రభాస్.

అయితే సాహో బడ్జెట్ ఎంత.. బిజినెస్ లెక్కలేంటి అన్న విషయాల మీద కన్ ఫ్యూజన్ ఉంది. ప్రభాస్ సాహో వరల్డ్ వైడ్ గా 320 కోట్ల బిజినెస్ చేసింది. నాన్ థియేట్రికల్ బిజినెస్ అంటే డిజిటల్, శాటిలైట్ ఇలా అన్నిటిని కలుపుకుని సాహో 450 నుండి 500 కోట్ల బిజినెస్ చేసిందని తెలుస్తుంది. బిజినెస్ ఎంత జరిగిందో దానికి తగినట్టుగా షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంది. సాధ్యమైనంత వరకు సాహో ఫస్ట్ డే, ఫస్ట్ వీకెండ్ కలక్షన్స్ మీద గురి పెట్టారు చిత్రయూనిట్.

వరల్డ్ వైడ్ గా సాహోకి భారీ ప్రీమియర్స్ వేస్తున్నారట. తొలిరోజే 100 కోట్ల టార్గెట్ పెట్టినట్టు తెలుస్తుంది. అదే జరిగితే మిగతా రెండు రోజుల్లో మరో 150 నుండి 200 కోట్లు రాబట్టే అవకాశం ఉంది. మొత్తానికి సాహో మరోసారి ప్రభాస్ సత్తా చాటేలా కనిపిస్తుంది. ఎక్కువగా బాలీవుడ్ లో సాహో ప్రమోషన్స్ చేస్తున్న ప్రభాస్ బాహుబలితో వచ్చిన క్రేజ్ ను కొనసాగించేలా ఉన్నాడు.