నన్ను అలా చూడటానికి ఇష్టపడరు..!

ఫిదా ఫేమ్ సాయి పల్లవి తెలుగులో తీసింది తక్కువ సినిమాలే అయినా తెలుగులో ఆమెకు సూపర్ పాపులారిటీ వచ్చింది. అంతకుముందు మళయాళ సినిమా ప్రేమమ్ లో మలార్ పాత్రతోనే సౌత్ ఆడియెన్స్ కు బాగా దగ్గరైన అమ్మడు తెలుగులో ఫిదాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఇక అప్పటినుండి సాయి పల్లవి సినిమా అంటే ఏదో ఒక స్పెషల్ ఉండి తీరుతుంది.

సినిమాలే కాదు అమ్మడు చేసిన సాంగ్స్ కూడా చాలా పాపులర్ అవుతాయి. ప్రస్తుతం సాయి పల్లవి నాగ చైతన్యతో లవ్ స్టోరీ.. రానాతో విరాట పర్వం సినిమాల్లో నటిస్తుంది. రెండు ప్రత్యేకమైన సినిమాల్లో నటిస్తున్న అమ్మడు తనని మోడ్రన్ డ్రెస్ లో ఆడియెన్స్ చూడటానికి ఇష్టపడరని. గ్లామర్ విషయంలో తన నిర్ణయం ఒకటేనని.. మనం చేసిన పాత్రలే మాట్లాడుతాయి కాబట్టి మనం మాట్లాడాల్సిన పనిలేదని చెప్పుకొచ్చింది. రాబోతున్న రెండు సినిమాలతో తన సత్తా చాటాలని చూస్తుంది అమ్మడు.