రొమాన్స్ లో సమంతకు చుక్కలు చూపించాడట..!

అక్కినేని కోడలు సమంత పెళ్లి తర్వాత కూడా అదే జోరు కొనసాగిస్తుంది. లాస్ట్ ఇయర్ రంగస్థలం ఈ ఇయర్ మజిలీ రెండు సూపర్ హిట్లు కొట్టింది అయితే మధ్యలో వచ్చిన యూటర్న్ కాస్త నిరాశపరచినా మళ్లీ అలాంటి కొత్త ప్రయత్నంతోనే ఓ బేబీ అంటూ వస్తుంది సమంత. కొరియన్ మూవీ మిస్ గ్రానీకి రీమేక్ గా వస్తున్న ఓ బేబీ సినిమాను నందిని రెడ్డి డైరెక్ట్ చేశారు. మధురా శ్రీధర్ నిర్మించిన ఈ సినిమాను సురేష్ బాబు సమర్పించడం జరిగింది.

ఈ సినిమాలో నాగ శౌర్య ఇంపార్టెంట్ రోల్ చేశాడు. సమంత బోయ్ ఫ్రెండ్ పాత్రలో నటిస్తున్న నాగ శౌర్య సినిమాలో ఆమెతో రొమాన్స్ చేయాల్సి వచ్చిందట. రొమాన్స్ అనగానే పడి పడి ముద్దులు పెట్టడం కాదు చిలిపి సరదా రొమాన్స్ అన్నమాట. అయితే అందుకు కూడా సమంత చాలా ఇబ్బంది పడ్డదట. నాగ శౌర్యలోని రొమాంటిక్ యాంగిల్ బయట పెట్టేందుకు సమంత డైరక్టర్ నందిని రెడ్డి చాలా కష్టపడ్డారట. తనలోని ఈ రొమాంటిక్ యాంగిల్ బయటపెట్టినందుకు నాగ శౌర్య కూడా సమంతకు థ్యాంక్స్ చెప్పాడు. మొత్తానికి రొమాన్స్ విషయంలో సమంతకు నాగ శౌర్య ఈ విధంగా చుక్కలు చూపించాడని తెలుస్తుంది.