ఛీ.. ఛీ.. అండర్ వేర్ తో సినిమా ప్రమోషన్.. ఏంటో ఈ చెండాలం..!

ఆరెక్స్ 100 సినిమాతో హీరోగా హిట్ కొట్టిన కార్తికేయ తన సెకండ్ మూవీ హిప్పితో రేపు అనగా గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. టి.ఎన్ కృష్ణ డైరక్షన్ లో తెరకెక్కిన హిప్పి సినిమా ప్రమోషన్స్ పీక్స్ లో చేస్తున్నారు. సినిమా టీజర్, ట్రైలర్ పర్వాలేదు అనిపించగా సినిమాకు బజ్ ఏర్పరచాలని కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్రెడీ సినిమా ఈవెంట్ లో తన షర్ట్ విప్పేసి నానా రచ్చ చేసిన కార్తికేయ వార్తల్లో నిలవగా ఇప్పుడు ఆ పిచ్చి పీక్స్ కు చేరిందని చెప్పొచ్చు.

హిప్పి సినిమాలో కార్తికేయతో పాటుగా జెడి చక్రవర్తి కూడా నటించాడు. ఈ సినిమాలో అతనికి మంచి పాత్ర లభించింది. అయితే సినిమా ప్రమోషన్స్ లో కరతికేయ షర్ట్ విప్పగా నేనేమైనా తక్కువా అని జేడి చక్రవర్తి ప్యాంట్ విప్పేసి అండర్ వేర్ మీద నిలబడ్డాడు. సినిమా ప్రమోషన్స్ కోసం సినిమా మీద ఆసక్తి కలిగించేలా చేయడం ఓకే కాని మరి ఇలా చెండాలంగా అండర్ వేర్ పై నిలబడటం చూసి ఛీ ఛీ అనేస్తున్నారు ఆడియెన్స్. సీనియర్ హీరో జేడి చక్రవర్తి వర్మ ఫ్యాక్టరీ నుండి వచ్చినవాడే. అందుకే ఇతను కూడా ఆయనలానే వెరైటీగా ప్రవర్తిస్తున్నాడు.