నాన్న శ్రీహరి తర్వాత ఎన్.టి.ఆరే..!

తెలుగు పరిశ్రమలో శ్రీహరి అంటే తెలియని వారుండరు. స్వతహాగా తన ప్రతిభతో సైడ్ క్యారక్టర్ నుండి విలన్ గా ప్రమోట్ అయ్యి ఆ తర్వాత హీరోగా కూడా ప్రేక్షకులను మెప్పించాడు. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్న టైంలో ఆయన లివర్ సమస్యతో మరణించడం జరిగింది. ఇన్నాళ్లకు శ్రీహరి ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీకి హీరో వచ్చాడు. శ్రీహరి చిన్న కొడుకు మేఘాంశ్ హీరోగా రాజ్ దూత్ సినిమా వస్తుంది. కార్తిక్, అర్జున్ దర్శక ద్వయం డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అవుతుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తండ్రి మరణం తర్వాత తమ ఫ్యామిలీ ఎన్నో కష్టాలు పడ్డదని. అమ్మ మతి స్థిమితం కోల్పోయారని చెప్పాడు మేఘాంశ్.. ఇప్పుడు అంతా సర్ధుకుందని.. నాన్న తర్వాత తనకు ఇష్టమైన హీరో ఎన్.టి.ఆర్ అని.. ఆయన డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్ వేరియేషన్స్ చాలా నచ్చుతాయని అనారు మేఘాంశ్. తన తండ్రి శ్రీహరి తర్వాత తను ఎక్కువగా ఇష్టపడే హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది ఎన్.టి.ఆర్ మాత్రమే అన్నాడు మేఘాంశ్. ఎన్.టి.ఆర్ కూడా శ్రీహరితో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. బాబాయ్ అంటూ శ్రీహరిని పిలిచే తారక్ ఆయన దూరమయ్యాక ఆ ఫ్యామిలీకి చాలా సపోర్ట్ గా ఉన్నారని తెలుస్తుంది.