ఆ స్టార్ హీరోయిన్‌తో తేజ రాసలీలలు.. గుట్టు రట్టు చేసిన శ్రీరెడ్డి

శ్రీరెడ్డి ‘లీక్స్’కి ఇక పూర్తిగా బ్రేక్ పడినట్లేనని అనుకుంటున్న తరుణంలో అమ్మడు ఓ పెద్ద బాంబ్ పేల్చింది. డైరెక్టర్ తేజను టార్గెట్ చేస్తూ… గోవాబ్యూటీ ఇలియానాతో ఆయన రాసలీలలు నడిపారంటూ కుండబద్దలు కొట్టింది. ‘‘తేజ రాసలీలల వినోదం.. తాజ్ బంజారాలో ఇల్లీ అక్కతో ఏంటి మరి.. మర్చిపోయావా..?’’ అంటూ ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది. కాకపోతే.. ఇందుకు తగిన ఆధారాలైతే ఆమె బయటపెట్టలేదు. కానీ.. ఆమె చేసిన ఈ ఆరోపణ మాత్రం ఇండస్ట్రీలో పెను దుమారమే రేపుతోంది.

అయినా శ్రీరెడ్డి ఇప్పుడు సడెన్‌గా తేజను ఎందుకు టార్గెట్ చేసిందనేగా మీ సందేహం! ‘సీత’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తేజకు శ్రీరెడ్డి గురించిన కాస్టింగ్ కౌచ్ విషయమై ప్రశ్నలు ఎదురయ్యాయి. అందుకు ఆయన కాస్త ఘాటుగానే బదులిచ్చారు. అప్పట్లో ఆమె (శ్రీరెడ్డి) ఏదో చూసిందని, ఇండస్ట్రీ పరువును రోడ్డుకి లాగేసిందని గోలగోల చేశారే తప్ప ఇండస్ట్రీ పరువు ఏమీ కాలేదన్నారు. ఇండస్ట్రీ అంటే తమాషాగా ఉందా..? ఎవరో నలుగురైదుగురు కలిసి పరిశ్రీమను రోడ్డుకి లాగుతామంటే ఇక్కడ గాజులు తొడుక్కొని ఉన్నామా..? అంటూ తేజ మండిపడ్డారు.

అందుకు కౌంటర్‌గానే శ్రీరెడ్డి ఇలా తేజను టార్గెట్ చేస్తూ.. ఇలియానాతో రాసలీలలు నడిపారంటూ ఆరోపణలు చేసింది. నిజానికి.. శ్రీరెడ్డి గొంతెత్తిన ‘కాస్టింగ్ కౌచ్’ ఉద్యమానికి తొలుత మద్దతిచ్చిందే తేజ! ఆమెకు ఇండస్ట్రీ పెద్దల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న టైంలో.. శ్రీరెడ్డి అండగా నిలబడడమే కాకుండా తన చిత్రాల్లో ఛాన్స్‌లు ఇస్తానన్నాడు. అలాంటి తేజపైనే శ్రీరెడ్డి ఇలాంటి ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. మరి.. దీనిపై తేజ రియాక్షన్ ఏంటో చూడాలి.