శ్రీహరి తనయుడు మేఘాంశ్ ‘రాజ్ దూత్’ టీజర్.. కుర్రాడు కత్తిలా ఉన్నాడు..!

రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ హీరోగా వస్తున్న సినిమా రాజ్ దూత్. అర్జున్ కార్తిక్ దర్శకద్వయం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టీజర్ రిలీజైంది. టీజర్ చూస్తే మర్యాదరామన్నలో సైకిల్ కోసం రవితేజ డబ్బింగ్ చెప్పినట్టుగా.. ఈ సినిమాలో రాజ్ దూత్ కోసం సునీల్ డబ్బింగ్ చెప్పారు. రాజ్ దూత్ బైక్ చుట్టూ తిరిగే సినిమాగా అనిపిస్తుంది.

హీరోగా మేఘాంశ్ ఆకట్టుకున్నాడు. స్టైలిష్ లుక్ ఇంప్రెస్ చేసింది. శ్రీహరి చరిష్మా కొనసాగించేలా కుర్రాడు కత్తిలా ఉన్నాడనిపిస్తుంది. సినిమాలో నక్షత్ర హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా టీజర్ ఇంప్రెస్ చేయగా సినిమా కూడా మెప్పించేలా ఉంది. శ్రీహరి చిన్న కొడుకుగా మేఘాంశ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా రాజ్ దూత్. కథ, కథనాలు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుండగా సినిమా ఎలా ఉంటుందో చూడాలి.