వరుణ్ తేజ్ వాల్మీకిలో… ‘ఆ స్టార్ హీరో’ సూపర్ హిట్ సాంగ్ రీమిక్స్..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా వాల్మీకి. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ నెగటివ్ రోల్ లో కనిపిస్తున్నాడు. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ జిగుర్తండా రీమేక్ గా వస్తున్న వాల్మీకి సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. రీసెంట్ గా రిలీజైన టీజర్ మెప్పించగా సినిమాలో ఒక స్పెషల్ రీమిక్స్ సాంగ్ ఉంటుందని తెలుస్తుంది.

మెగా హీరో సినిమా కాబట్టి మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ పాట ఒకటి రీమిక్స్ చేసి ఉంటారని అనుకోవచ్చు. కాని సినిమాలో రీమిక్స్ చేసింది చిరు పాట కాదట. శోభన్ బాబు సాంగ్ అని తెలుస్తుంది. వాల్మీకి సినిమాలో దేవత సినిమాలో ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మో సాంగ్ రీమిక్స్ చేశారట. శోభన్ బాబు, శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన ఆ సాంగ్ అప్పటికి ఇప్పటికి సూపర్ హిట్.

వాల్మీకి సినిమాలో ఈ సాంగ్ రీమిక్స్ చేసి పెట్టడంతో మరింత క్రేజ్ పెరిగింది. మిక్కి జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రాం ఆచంట, గోపి ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. సైరా అక్టోబర్ 2న రిలీజ్ అంటుండగా ఒక వారం రోజుల ముందే వరుణ్ తేజ్ వాల్మీకిగా వచ్చి హిట్ కొట్టాలని చూస్తున్నాడు.