టీడీపీ వాళ్ళు కూడా జగన్ నిర్ణయానికి సపోర్ట్ ఇస్తున్నారుగా !

పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ నుంచి కృష్ణ జలాలను రాయలసీమ ప్రాంతాలకు తరలించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 203 వ జీవో ను విడుదల చేసింది. ఈ జీవో పై పలు చోట్ల నుంచి రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక వైసీపీ పార్టీ నేతలు అయితే జగన్ తీసుకున్నది సంచలన నిర్ణయం అని ఆకాశానికి ఎతేస్తున్నారు. కానీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు మాత్రం జీవో కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

మరోవైపు టిడిపి పార్టీకి చెందిన కర్నూల్ ఎమ్మెల్సీ బీటెక్ రవి మాత్రం బహిరంగంగానే వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన 203 వ జీవోను సమర్థిస్తునట్లు చెప్పారు. నిజానికి రాయలసీమ ప్రాంతానికి ఎవరు మంచి చేసిన సపోర్ట్ ఇస్తాము అని చెప్పారు. మొత్తానికి ఈ విషయంలో రాజకీయం చేస్తే రాయలసీమ ప్రజలలో నెగటివ్ గా మారిపోతాము అని తెలిసి టిడిపి సైలెంట్ గా వైసీపీ ప్రభుత్వం చేసింది కరెక్ట్ అని వొప్పుకోలేక వోపుకుంటుంది.