షాకింగ్ న్యూస్ : టాలీవుడ్ యువ నటుడు మృతి..!

టాలీవుడ్ వరుస విషాదాలు కలచి వేస్తున్నాయి. ఈమధ్యనే దర్శక నిర్మాత నటి విజయనిర్మల మరణం ఇండస్ట్రీని షాక్ అయ్యేలా చేసింది. అది మరవకముందే మరో ప్రముఖ నటుడి మృతి అందరికి షాక్ ఇస్తుంది. సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో వచ్చిన సమ్మోహనం సినిమాలో నటించిన అమిత్ పురోహిత్ మృతి చెందారు. సినిమాలో హీరోయిన్ అదితిరావు హైదరి ఎక్స్ బోయ్ ఫ్రెండ్ గా నటించాడు అమిత్ పురోహిత్. అమిత్ మరణ వార్త తనని తీవ్రంగా బాధపెట్టిందని మంచి టాలెంట్ ఉన్న నటుడని.. ప్రతి షాట్ కు 100 శాతం ఎఫర్ట్ పెడతాడని అన్నారు సుధీర్ బాబు. మంచి నటుడు మిస్సయ్యాడని.. ఆయన ఆత్మ శాంతి చేకూరాలని అన్నారు.

ఇక సమ్మోహనం దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కూడా అమిత్ మరణ వార్త విని షాక్ అయ్యారు. తాను ఇది నమ్మలేకపోతున్నానని.. మంచి నటుడు.. అమిత్ మరణాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నా అని.. తన తర్వాత సినిమాలో అతనికి ఓ అవకాశం ఇద్దామనుకున్నా అని భావోద్వేగంగా ట్వీట్ చేశారు మోహనకృష్ణ ఇంద్రగంటి.