ఊరించే అందాలతో ఊర్వశి రౌతెలా..!

బాలీవుడ్ లో అందాల భామలకు కొదవే లేదు. సినిమాల్లోనే కాదు ఫోటో షూట్స్ లో కూడా వీరి విన్యాసాలు అదరగొడతాయి. ముఖ్యంగా ప్రేక్షకులను తమ అందాల మత్తులో దించాలనే బ్యూటీలు సోయగాలతో కిక్ ఎక్కిస్తారు. ప్రస్తుతం హేట్ స్టోరీ 4 భామ కూడా అదే పనిగా పెట్టుకుంది. మోడలింగ్ నుండి హీరోయిన్ గా మారిన ఊర్వశి రౌతెలా సింగ్ సాబ్ ది గ్రేట్.. సనమ్ రే.. గ్రేట్ గ్రాండ్ మస్తి సినిమాల్లో అదరగొట్టింది.

ఇక హేట్ స్టోరీ 4 లో అయితే ఊర్వశి అందాలకు ఫిదా అయ్యారు బాలీవుడ్ ఆడియెన్స్. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క ఫోటో షూట్స్ తో అందాలకు పనిచెబుతున్న ఊర్వశి లేటెస్ట్ గా ఎఫ్.హెచ్.ఎం కోసం ఇచ్చిన ఫోటో షూట్ హాట్ న్యూస్ గా మారింది. ఎఫ్.హెచ్.ఎం కవర్ పేజ్ కోసం ఊర్వశి ఊరించే అందాలతో డిస్ట్రబ్ చేస్తుంది. సినిమాల్లో హాట్ సీన్స్ కు ఏమాత్రం అడ్డు చెప్పని ఊర్వశి కరెక్ట్ సినిమా పడితే స్టార్ గా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ అమ్మడి అందాలు కేవలం బాలీవుడ్ కే అంకితమవుతాయా లేదా ఎవరైనా తెలుగు దర్శక నిర్మాతలు ఆమెను ఇక్కడకు తీసుకొస్తారేమో చూడాలి.