ఎన్.టి.ఆర్ పేరు చెప్పి ఆ టాప్ తెలుగు హోరోయిన్ ను భారీ మోసం..!

లాస్ట్ ఇయర్ ఓ సినిమాతో హిట్ కొట్టిన హీరోయిన్ తో ఓ లెడీ ఓరియెంటెడ్ మూవీ ప్లాన్ చేశారు. నూతన దర్శకుడు చెప్పిన కథకు ఓ రెండు సినిమాలు తీసిన ఓ నిర్మాత ఈ సినిమా తెరకెక్కించేలా ప్లాన్ చేశారు. సినిమా 80 శాతం పైగా పూర్తయిన ఈ సినిమా నుండి హీరోయిన్ బయటకు వెళ్లిందని టాక్. అదేంటి అంటే నిర్మాత ఎన్.టి.ఆర్ కు చాలా సన్నిహితుడు హీరోయిన్ గా ఆమెను ఒప్పించే టైంలో సినిమాలో ఎన్.టి.ఆర్ ఓ చిన్న రోల్ చేస్తాడని చెప్పారట. సినిమా 80 శాతం అవుతున్నా తారక్ మాత్రం ప్రాజెక్ట్ లోకి ఎంటర్ కాలేదట. అందుకే సినిమా నుండి ఆమె తప్పుకున్నట్టు తెలుస్తుంది.

అయితే ఆమెను బ్రతిమాలే పనిలో పడ్డారట దర్శక నిర్మాతలు. ఎన్.టి.ఆర్ కాకున్నా ఆ స్థానంలో మరో హీరోని పెడతామని ప్రామిస్ చేశారట. ఎన్.టి.ఆర్ పేరు చెప్పి ఆ హీరోయిన్ ను మోసం చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో హాట్ న్యూస్ గా మారిన ఈ ఇష్యూలోకి తారక్ జోక్యం చేసుకుంటాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. తెలుగులో క్రేజ్ ఉన్నా తమిళ సినిమాల మీదే కాన్సెంట్రేట్ చేస్తున్న ఆ హీరోయిన్ కు ఈ సినిమా ఒప్పుకున్నందుకు తెగ బాధపడుతుందట.