బాబూ మీ “కియా” అవినీతి పుట్ట త్వరలోనే పగిలిద్ది : విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్

ఎన్నికల వేళ వైస్సార్సీపీ ఎంపీ వేసిన ట్వీట్లు ఎంతగా సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చాక కూడా ఏమాత్రం తగ్గకుండా బాబు కి చుక్కలు చూపించేలా సంచలన ట్వీట్లతో దుమ్మురేపుతున్నాడు. గత తెలుగు దేశం ప్రభుత్వం తమ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రముఖంగా చెప్పుకొచ్చింది కియా మోటార్స్ గురించి.. అనంతపురం లో అద్భుతాన్ని సృష్టించామని తెగ హడావుడి చేసిన విషయం తెలిసిందే.

అయితే టీడీపీ కి విరుద్ధంగా విజయసాయిరెడ్డి ఇప్పుడు బాబూ మీ కియా అవినీతి పుట్ట మా యువ ముఖ్యమంత్రి త్వరలోనే పగలగొడతాడని అంతే కాక తెలుగుదేశం హయాంలో జరిగిన అవినీతిని అంతా బయటపెడతామని ప్రభుత్వ ఆఫీస్ అద్దెల విషయంలోనూ అడ్డగోలుగా వ్యవహరించి ప్రజల సొమ్ముని ఇష్టమొచ్చినట్లు దుబారా చేశారని.. ప్రజల సొమ్ము అంటే అంత చులకనా బాబూ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ తో ప్రశ్నించాడు.