Cinema

చిరంజీవి భలే భలే మగాడివోయ్ అంటే…!

‘ఖైదీ నెం.150’ చిత్రంతో సినీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు. దీంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు సినిమాలు లైన్లో పెట్టుకున్న చిరు తాజాగా మరో యంగ్ డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. ఆ దర్శకుడు ఎరు అనే విషయం అందరిలో ఇంట్రెస్ట్ ను కలుగజేస్తుంది. సీనియర్ డైరెక్టర్స్ తో పాటు యంగర్ డైరెక్టర్స్ కు చాన్స్ ఇవ్వడం మెగా స్టార్ స్పెషాలిటీ అని చెప్పొచ్చు. సినిమా పట్ల పరిపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తిగా చిరంజీవి కథ విన్నాకే నిర్ణయం తీసుకుంటారని ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో చర్చించుకుంటుండటం మనం వినొచ్చు. తాజాగా టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు సమాచారం.

‘ప్రతీ రోజు పండగే’ మూవీతో తనలోని టాలెంట్‌ను మరోసారి ప్రూవ్ చేసుకున్న మారుతి చిరు బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లు ఆల్రెడీ మూడు స్టోరీలు రాసుకున్నారట. ఇటీవల ఓ స్టోరీని చిరుకు వినిపించగా అది ఆయనకు నచ్చి ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ కథను ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ విన్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే మారుతి దర్శకత్వంలో వచ్చే చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ‘మంచి రోజులు వచ్చాయి’ అనే చిత్రాన్ని పూర్తి చేసిన డైరెక్టర్ మారుతి ప్రజెంట్ గోపీచంద్ హీరోగా ‘పక్కా కమర్షియల్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

కథకు కమర్షియల్ యాంగిల్స్ చేయడంలో మారుతి దిట్ట. కాగా మెగా స్టార్ తో రాబోయే మూవీ పక్కా కమర్షియల్ ప్లస్ కామెడీ యాంగిల్ లో ఉండబోతున్నదని తెలుస్తోంది. మెగా స్టార్ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్స్ తో వర్క్ చేసేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మెగా స్టార్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రం చేస్తుండగా ఆ తర్వాత మోహన్ రాజా బాబీ మెహర్ రమేశ్ దర్శకత్వంలో సినిమాలు చేయబోతున్నారు. వీరందరూ మెగా స్టార్ కంటే వయసులో అనుభవంలో చాలా చిన్నవారే. అయినా వారి కథ టాలెంట్‌ను బట్టి సినిమాలకు అవకాశం ఇస్తున్నారు మెగాస్టార్. అయితే మారుతి-మెగాస్టార్ కాంబో మూవీ ఓకే అయినప్పటికీ అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తేనే ఆ సినిమా పూర్తి వివరాలు తెలుస్తాయి.

‘ఆచార్య’ చిత్రం తర్వాత మెగా స్టార్ చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్ చిత్రాన్ని మోహన్ రాజా దర్శకత్వం లో చేయబోతున్నారు. ఈ చిత్రంలో మెగా స్టార్‌కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ నటించబోతుందట. ఇక ఈ చిత్రం తర్వాత చిరు ‘వేదాళం’ రీమేక్ మెహర్ రమేశ్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఇందులో సీనియర్ హీరోయిన్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి షూట్ లోకేషన్స్‌ను మెహర్ ఆల్రెడీ సెర్చ్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రం తర్వాత ‘జై లవ కుశ’ ఫేమ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్లో మెగా స్టార్ నటించబోతున్నారు.

About the author

admin

Leave a Comment