డైరక్టర్.. హీరోయిన్ ఎఫైర్.. ఫిల్మ్ నగర్ హాట్ టాపిక్..!

టాలీవుడ్ లో ఫాంలో ఉన్న ఓ యువ దర్శకుడు హీరోయిన్ తో ఎఫైర్ నడిపిస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. వీరి వ్యవహారం చాలా దూరం వెళ్లిందట. అయితే ఆ డైరక్టర్ కు ఆల్రెడీ పెళ్లి కూడా అయ్యిందని తెలుస్తుంది. మరి పెళ్లైన అతగాడితో హీరోయిన్ తో ఎఫైర్ ఏంటో అంకుంటున్నారట. అతను తప్ప మరెవరు ఆమెకు దొరకలేదేమో అని గుసగుసలాడుతున్నారు.. ఇదిలాఉంటే ఈ వ్యవహారం డైరక్టర్ ఇంట్లో తెలిసిందట. డైరక్టర్ తన భార్యతో గొడవ కూడా పడ్డారట. ఇంట్లో పోరు భరించలేక డైరక్టర్ ఆ హీరోయిన్ ను వదిలేశాడట.

అయితే ఇంట్లో అంతా సెట్ రైట్ అయ్యాక మళ్లీ ఆ డైరక్టర్ మరో ఎఫైర్ పెట్టుకున్నాడట. ఈసారి మరో హీరోయిన్ తో డైరక్టర్ ఎఫైర్ నడుస్తుందని తెలుస్తుంది. ఈసారి ఇంట్లో తెలియకుండా డైరక్టర్ మ్యానేజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎంత మ్యానేజ్ చేసినా ఎప్పటికైనా తెలుస్తుంది. మరి ఇతగాడి బుద్ధి ఎప్పటికి మారుతుందో చూడాలి. ఇప్పటికే మీటూ ఎఫెక్ట్ తో డైరక్టర్స్ మీద నిఘా ఎక్కువవగా ఈ యువ దర్శకుడు చేసే పనికి ఎప్పుడో ఒకసారి బుక్కవుతాడని కొందరు అంటున్నారు.

Leave a Reply

*