Cinema

బాలయ్య ఏకంగా కొండనే ఢీ కొట్టడానికి సిద్ధం అవుతున్నాడే!

ఇప్పటికే దసరాకు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. సినిమా విడుదల తేదీ విషయంలో జక్కన్న టీమ్ ఫుల్ క్లారిటీ ఇవ్వడంతో పాటు వాయిదా అనేదే లేదు అంటూ స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. థర్డ్ వేవ్ వస్తే తప్ప ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆగడం దాదాపు అసాధ్యం అన్నట్లుగా టాక్ వినిపిస్తుంది.

కనుక ఆర్ ఆర్ ఆర్ వస్తున్న దసరా సీజన్ లో రావడానికి ఏ హీరోలు ఆసక్తి చూపడం లేదు. సంక్రాంతిపై చాలా మంది హీరోలు ఫోకస్ పెట్టారు. బాలయ్య కూడా డిసెంబర్ లేదా జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని అంతా భావించారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దసరాకే సినిమాను బాలయ్య విడుదల చేయాలని ఆశ పడుతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఆర్ ఆర్ ఆర్ సినిమాను అక్టోబర్ 13వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. 99 శాతం సినిమా విడుదల కన్ఫర్మ్ అంటున్నారు. కనుక ఆ సమయంలో మరే సినిమాను విడుదల చేసేందుకు సిద్దం అవ్వడం లేదు. కాని బాలయ్య మాత్రం తన అఖండ సినిమాను ఆర్ ఆర్ ఆర్ సినిమాకు వారం ముందు లేదా వారం తర్వాత అయినా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment