Cinema

మిక్సుడ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ రాంపేజ్…3 వ రోజు ఊచకోత కలెక్షన్స్!

కరోనా సెకెండ్ వేవ్ తర్వాత ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో ది బెస్ట్ ఓపెనింగ్స్ తో దూసుకు పోతున్న సినిమా కిరణ్ అబ్బవరం మరియు ప్రియాంక జవల్కర్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన SR కళ్యాణ మండపం సినిమా. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ ను సొంతం చేసుకోగా ఇలా రిలీజ్ అయ్యిందో మొదటి ఆట నుండే సినిమాకి మిక్సుడ్ రివ్యూ లు దక్కడం జరిగింది.

దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పై ఆ ఇంపాక్ట్ కచ్చితంగా ఉంటుంది అనిపించినా సినిమా కి ఆ ఎఫెక్ట్ ఏమాత్రం కనిపించలేదు బాక్స్ ఆఫీస్ దగ్గర. సినిమా మొదటి రోజే రెండు తెలుగు రాష్ట్రాలలో 1.4 కోట్ల కి పైగా షేర్ ని సొంతం చేసుకోగా రెండో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….

1.25 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2 రోజులు పూర్తీ అయ్యే టైం కి 4.88 కోట్ల గ్రాస్ ని 2.89 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా మూడో రోజు ఆదివారం అవ్వడం తో సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో….

ఆది వారం అడ్వాంటేజ్ తో భారీగా దుమ్ము లేపుతుంది. సినిమా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల లో సాలిడ్ ట్రెండ్ ని సాగించగా ఈవినింగ్ షోలకి వచ్చే సరికి సినిమా నైజాం లో లిమిటెడ్ ఆక్యుపెన్సీనా ఉన్నప్పటికీ కూడా ఆక్యుపెన్సీ 100% ఉండటం తో కలెక్షన్స్ బాగానే సాధిస్తుంది. మూడు రోజుల్లో ఇక్కడ బ్రేక్ ఈవెన్ ను సొంతం చేసుకోబోతుంది ఈ సినిమా..

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో అవలీలగా 1 కోటి నుండి 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునేలా ఉంది. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే సినిమా ఇంకా బెటర్ కలెక్షన్స్ ని సాధించవచ్చు. మొత్తం మీద మొదటి వీకెండ్ ని సూపర్ సాలిడ్ గా ముగించబోతుంది ఈ సినిమా.

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment