Cinema

అఖండ ఓవర్సీస్ బిజినెస్ డీటైల్స్.. బాలయ్య మజాకా..!

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ అఖండ సినిమా డిసెంబర్ 2న భారీగా రిలీజ్ అవుతుంది. సింహా, లెజెండ్ తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమాగా అఖండ మీద భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాలో బాలయ్య అఘోర లుక్ ఇప్పటికే అంచనాలు పెంచేసింది. ఇక ముందు వచ్చిన టీజర్, రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ సినిమాపై మరింత బజ్ ఏర్పరిచేలా చేశాయి.

తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య సత్తా చాటేలా అఖండ బిజినెస్ జరుగగా ఓవర్సీస్ లో కూడా అఖండ రైట్స్ 2 కోట్లకు పలికినట్టు తెలుస్తుంది. ఓవర్సీస్ లో అఖండ హిట్ అనిపించుకోవాలంటే 700k మిలియన్స్ రాబట్టాల్సి ఉంటుంది. నందమూరి ఫ్యాన్స్ అఖండ మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. సినిమా వారు ఆశించిన స్థాయిలో ఉంటుందో లేదో చూడాలి. ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటించిన అఖండ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు.

About the author

admin

Telugu News, Telugu Cinema News,Telugu Cinema Videos,Telugu Cinema Actress Photos, Hot Gossips,Tollywood Gossips News,

Leave a Comment