మరో సంచలన సర్వే... మంట పెట్టేశాడుగా!


మరో సంచలన సర్వే... మంట పెట్టేశాడుగా!
2014 తరహాలోనే ఈసారి కూడా టిడిపి, వైసిపిల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుందని అంతా అనుకున్నారు. ‘జనసేన’ బరిలో ఉన్నప్పటికీ... ఫక్తు రాజకీయ పార్టీలా యాక్టివిటీస్ లేకపోయేసరికి ఆ పార్టీ పెద్దగా సత్తా చాటుకోదని భావించారు. జగన్, చంద్రబాబుల మధ్య పోటీ తీవ్రంగా ఉంటుందని ఓ నిర్ణయానికి వచ్చేశారు.

అయితే... పోలింగ్‌కి కొన్ని రోజుల ముందు పవన్ అనూహ్యంగా తన జోరు పెంచారు. అందరికంటే ముందు పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించడమే కాదు... వైసిపి, టిడిపిలకు మించి ప్రచారాలు నిర్వహించారు. దీంతో ఎన్నికల ఫలితాలపై పవన్ ప్రభావం కచ్ఛితంగా ఉంటుందనే అంచనా ఏర్పడింది. ఓట్లలో భారీ చీలిక రావడం ఖాయమని విశ్లేషకులూ చెప్పారు.

అది నూటికినూరు శాతం నిజమని తాజాగా ఓ సర్వే బాంబ్ పేల్చింది. ముందుగా విశ్లేషించుకున్నట్టుగానే పవన్ ప్రభావం ఎన్నికలపై భారీగా పడిందని, ఓట్లలో చీలక తీసుకురావడమే కాకుండా ఊహించని దానికంటే ఎక్కువ సీట్లు కొల్లగొట్టుకుపోయాడని ఆ సర్వే చెప్తోంది. టిడిపి వర్సెస్ వైసిపిని త్రిముఖ పోటీగా మార్చేశాడని అంటోంది.

మొత్తం 175 స్థానాల్లో టిడిపికి 56, వైసీపీకి 79 సీట్లు వస్తే... జనసేకు 40 సీట్లు వస్తాయని ఆ సర్వే వెల్లడిస్తోంది. అంటే... పవన్ దెబ్బకు హంగ్ ఏర్పడడం గ్యారెంటీ అని చెప్తోంది. ఈ లెక్కన పవన్ ఎవరికి మద్దతు ఇస్తారో... అధికారం వారికే దక్కనుందని, విశ్లేషకులు చెప్పినట్లుగా పవన్ కింగ్ మేకర్ అవుతాడని ఆ సర్వే తేల్చిచెప్తోంది.

ఇప్పటివరకూ ఏ సర్వే జనసేన గురించి ఇలా ప్రస్తావించలేదు. 3-5 సీట్లు వస్తాయని జోస్యం చెప్పాయి. కానీ ఈ సర్వే మాత్రం ఏకంగా 40 వస్తాయని చెప్పడంతో... రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరి ఈ లెక్కలు ఎంత వరకు నిజమో తేలాలంటే మే 23 వరకు వెయిట్ చేయాల్సిందే!

Comments

CheppuMama is a extraordinarily good and attractive facebook web/mobile apps website which is a very good and flexible responsive . This Website uses Graph API of facebook and it requests permissions from the users and it receives the information. The app analyzes the profile and gives out the possible best results .

CheppuMama apps are now only in Telugu language. CheppuMama entertains with the most creative/innovative ideas based on current affairs, movies, politics, news, sports and others.

CheppuMama welcomes new ideas in entertaining our huge base of users. Please send the messages in our Cheppumama facebook page

Stay tuned, like our page and follow us for more entertaining stuff which always entertains you.