జగన్ ఇచ్చిన ట్విస్ట్‌కి బిజెపి ఫ్యూజులు ఔట్


జగన్ ఇచ్చిన ట్విస్ట్‌కి బిజెపి ఫ్యూజులు ఔట్
చంద్రబాబు తమకు వ్యతిరేకం అయ్యారని వైసిపిని తన పంచన చేర్చుకుంది బిజెపి! తమకు మద్దతిస్తే చాలా ప్రయోజనాలుంటాయని కాకాపట్టడంతో... కేంద్రంలో ఉన్న పార్టీ కావడంతో తమకూ కలిసొస్తుందని వైసిపి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక అప్పటినుంచి రెండు పార్టీలు రహస్యంగా చాలా తతంగాలు నడుపుతూ వస్తున్నాయి.

అయితే రాజకీయాల్లో శాశ్వత శతృవులు, శాశ్వత మిత్రులు ఉండరు. తమకు నచ్చినట్టుగా వ్యవహరిస్తేనే స్నేహం కొనసాగుతుంది. లేకపోతే కటీఫ్ చెప్పేసుకుంటారు. ఇప్పుడు వైసిపి, బిజెపిల మధ్య అలాంటి పరిస్థితులే వచ్చినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్ళూ తలూపిన జగన్... ఇక తన టైం రావడంతో బిజెపికి ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు.

మేటర్ ఏంటంటే... గత ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన బిజెపికి ఇప్పుడు అలాంటి ఛాన్సులు కనిపించడం లేదు. ప్రాంతీయ పార్టీలతో కలుపుకుపోతేనే గెలిచే అవకాశం ఉంది. అందుకే... తమకు మద్దతివ్వాలని అడుక్కోవడం ప్రారంభించింది. వైసిపిని కూడా రిక్వెస్ట్ చేయగా... జగన్ ఫ్యూజులు ఎగిరిపోయేలా రేంజ్‌లో వాళ్ళకి షాకిచ్చాడు.

ఏపీకి ప్ర‌త్యేక‌హోదా ఇవ్వడంతోపాటు రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని, అలాగే తన వైసిపి ఎంపీలకు మంత్రి పదవులు ఇవ్వాల‌ని బిజెపి ముందు ప్రతిపాదనలు పెట్టారట! ఆ పనులన్నీ పూర్తి చేస్తేనే మద్దతు ఇస్తానని, లేకపోతే లేదంటూ తేల్చి చెప్పాడట! దీంతో ఖంగుతిన్న బిజెపి... అందుకు సమయం కావాలని తుర్రుమన్నట్టు తెలిసింది.

Comments

CheppuMama is a extraordinarily good and attractive facebook web/mobile apps website which is a very good and flexible responsive . This Website uses Graph API of facebook and it requests permissions from the users and it receives the information. The app analyzes the profile and gives out the possible best results .

CheppuMama apps are now only in Telugu language. CheppuMama entertains with the most creative/innovative ideas based on current affairs, movies, politics, news, sports and others.

CheppuMama welcomes new ideas in entertaining our huge base of users. Please send the messages in our Cheppumama facebook page

Stay tuned, like our page and follow us for more entertaining stuff which always entertains you.